తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కాసేపట్లో అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మల్లు భట్టి

  • సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
  • 2026-27 బడ్జెట్ కు కేబినెట్ ఆమెదం
  • మండలిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే 2026-27 వార్షిక బడ్జెట్ ను కాసేపట్లో రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కాసేపట్లో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయంలో మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ను సభ ముందు ఉంచనున్నారు. బడ్జెట్ లో ప్రధానంగా పేదలకు మేలు చేసే విధంగా పలు కేటాయింపులు ఉండవచ్చని తెలుస్తోంది. 

Mallu Bhatti Vikramarka
Telangana Budget 2026
Telangana Budget
Revanth Reddy
Uttam Kumar Reddy
Telangana Assembly
Telangana Cabinet
Telangana Economy

More Telugu News